News March 5, 2025
త్వరలో అమరావతికి టెండర్లు: ఎంపీ కేశినేని

అమరావతి నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా విజన్‌తో ముందుకు వెళుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్లు మరో మూడు నాలుగు రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు. అని బిల్డర్ కన్‌స్ట్రక్షన్ రంగాలలో టెక్నాలజీ అందిపుచ్చుకోవాలన్నారు.
Similar News
News March 25, 2025
ఆ హీరోయిన్ మృతితో హీరోకు సంబంధం లేదు: మాజీ ప్రియుడు

దక్షిణ కొరియా నటి <<15483613>>కిమ్ సె రాన్<<>> మృతికి నటుడు కిమ్ సూ హ్యూన్, మరో యూట్యూబర్ కారణం కాదని ఆమె మాజీ ప్రియుడు స్పష్టం చేశారు. నిజానికి తనను పట్టించుకోని కుటుంబం వల్లే ఆమె ఎంతో వేదన చెందారని తెలిపారు. న్యూయార్క్‌లో ఆమె రహస్యంగా ఒకరిని పెళ్లిచేసుకొని లైంగిక బంధం కొనసాగించారని వెల్లడించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని కుటుంబం ఇప్పుడొచ్చి వేరొకరిని నిందిస్తుండటం బాధాకరమని విమర్శించారు.
News March 25, 2025
సౌలభ్యాన్ని బట్టి త్వరలోనే బకాయిల విడుదల: సీఎం

AP: గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.20,637 కోట్ల అలవెన్సులను ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే రూ.7,230 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను అకౌంట్లలో జమ చేస్తామని కలెక్టర్ల సదస్సులో హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
News March 25, 2025
జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చారా?

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంత వరకు సహాయ పడుతుందో తెలియజేయాలన్నారు.