News April 11, 2025
త్వరలో ఏనుగుల తరలింపు: మంత్రి

ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు.
Similar News
News January 13, 2026
WGL: డీసీసీ కమిటీ జాప్యంపై అసంతృప్తి

వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇటీవల డీసీసీ భవన్‌లో ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో
ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్‌లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. అయితే నియామకం జరిగి 48 రోజులు గడిచినా డీసీసీ పూర్తి స్థాయి కమిటీని ఇంకా ప్రకటించలేదు. కమిటీ జాప్యంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్ష నియామకం జరిగినా కమిటీ ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.
News January 13, 2026
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే..!

ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల సాధ్యమైనంత మేరకు <<18842236>>డయాబెటిస్<<>>ను దూరం పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి చాలా ముఖ్యం’ అని సూచిస్తున్నారు. మరోవైపు మీ శరీర బరువు అదుపులో ఉంచుకుంటే మధుమేహం వచ్చే అవకాశం 60% వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
News January 13, 2026
నేడు మహబూబాబాద్‌కు పొంగులేటి రాక

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు మంగళవారం రానున్నారు. రూ.79 కోట్లతో మహబూబాబాద్ మున్సిపాలిటీలో చేపట్టబోయే రోడ్ల నిర్మాణం, బంధం చెరువు బండ్ అభివృద్ధి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొననున్నారు. మంత్రి రాక నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.


