News March 22, 2024
త్వరలో ధరణిపై శ్వేతపత్రం: మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మాట్లాడుతూ.. ‘ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. నా వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉంది. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం. రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదు.’ అంటూ కీలక నిర్ణయాలు వెల్లడించారు.
Similar News
News December 1, 2025
ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. అధికారులకు షోకాజ్ నోటీసులు

పంచాయతీ ఎన్నికల శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా హాజరుకాని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల విధులు చాలా కీలకమని, సిబ్బందిని సన్నద్ధం చేసేందుకే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీరిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 1, 2025
IELTSకు దరఖాస్తుల ఆహ్వానం: బీసీ స్టడీ సర్కిల్

ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అంతర్జాతీయ స్కాలర్షిప్ పొందడం లక్ష్యంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 1, 2025
మార్చి 2026 నాటికి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి: తుమ్మల

మార్చి 2026 నాటికి ఖమ్మం మున్నేరు రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నగర్ మేయర్ నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో తుమ్మల సమీక్షించారు. ప్రతి నెల ఎంత మేరకు పనులు పూర్తవుతాయో నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని పేర్కొన్నారు.


