News June 27, 2024
త్వరలో నామినేటెడ్ పదవులు.. రేసులో ఉన్నదెవరు?
త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News October 6, 2024
విశాఖ: ఉక్కు పోరాట కమిటీతో నేడు పవన్ కళ్యాణ్ భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆదివారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ యువ కార్మికులు శనివారం మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ జనసేన నాయకులను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో తమను కలిసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్లు కమిటీ నాయకులు తెలిపారు.
News October 6, 2024
చింతపల్లి: కులం పేరుతో దూషించాడని స్నేహితుడినే చంపారు
కులం పేరుతో దూషించాడని లోతుగెడ్డ జంక్షన్ వద్ద అర్జున్ (50) అనే వ్యక్తిని ఇద్దరు స్నేహితులు కొట్టి చంపారు. గత నెల 27న పుష్పరాజ్, వెంకటేశ్, అర్జున్ అనే ముగ్గురు స్నేహితులు మద్యం తాగేందుకు లోతుగెడ్డ వెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో పుష్పరాజ్‌ను అర్జున్ కులం పేరుతో దూషించాడు. దీంతో అతడిని రాయితో కొట్టి హతమార్చారు. ఈమేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీఐ రమేశ్, ఎస్సై అరుణ్ కిరణ్ తెలిపారు.
News October 5, 2024
బుచ్చియ్యపేట: కరెంట్ షాక్.. బాలుడు మృతి
విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుచ్చియ్యపేట మండలంలోని పి.భీమవరంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేపాడ అప్పారావు కుమారుడు భువన్ శంకర్ శనివారం పొలంలోకి వెళ్లాడు. అక్కడ గెడ్డ దాటుతుండగా అప్పటికే నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చోడవరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.