News July 30, 2024

త్వరలో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం: హోం మంత్రి

image

నక్కపల్లి మండలం APIIC నిర్వాసితుల సమస్యలపై విశాఖ సర్క్యూట్ హౌస్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఏడు గ్రామాల రైతులు, ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. త్వరలోనే ఏపిఐఐసీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మంత్రి కలెక్టర్ విజయకృష్ణన్, అధికారులను ఆదేశించారు.

Similar News

News July 11, 2025

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన: గండి బాబ్జి

image

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేపట్టనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వెల్లడించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖలోని సుమారు 300 గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించి ఉద్యానవనాల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు.

News July 11, 2025

విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

image

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.