News May 4, 2024
త్వరలో నూతన హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్!
చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో నూతన హంగులతో ప్రజలందరికీ అందుబాటులోకి రానుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎలివేషన్ డిజైన్ సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, సకల హంగులతో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు ఎలివేషన్, మరోవైపు ఫకాడే, పార్కింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News November 14, 2024
HYD: రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్
గ్రేటర్ HYD పరిధిలోని పలు రెస్టారెంట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. మొఘల్ రెస్టారెంట్, డైన్‌హిల్ మండి రెస్టారెంట్లలో చికెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. పాడైపోయిన మాంసాన్ని, ఫ్రిడ్జ్లతలో నిల్వ చేసినట్లు గుర్తించాం అన్నారు. హోటల్ నిర్వహణ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్‌కు పంపాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.
News November 13, 2024
డీఆర్డీఎల్ను సందర్శించిన రాధా మోహన్ సింగ్
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో కమిటీ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL)ని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్షిపణి ప్రదర్శన కేంద్రాన్ని ఛైర్మన్ ప్రారంభించారు. భారతదేశం రక్షణ సాంకేతికతలలో కొనసాగుతున్న పురోగతిని సమీక్షించడం, క్షిపణి అభివృద్ధిలో భవిష్యత్తు పరిశోధన దిశలను అంచనా వేయడం ఈ పర్యటన లక్ష్యమన్నారు.
News November 13, 2024
HYD కమిషనరేట్ పరిధిలో సీఐలకు పోస్టింగ్
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెయిటింగ్లో ఉన్న 17 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ ఇస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 11 మందిని వివిధ స్టేషన్లలో డీఐలుగా నియమించగా, ముగ్గురిని సీసీఎస్‌లో, ముగ్గురికి ఎస్బీలో పోస్టింగ్ ఇచ్చారు. వీరంతా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.