News January 29, 2025
త్వరలో మరో 2 కొత్త ఐటీ పార్కులు: మంత్రి శ్రీధర్ బాబు

త్వరలో హైదరాబాద్లో మరో 2 కొత్త ఐటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. హైటెక్ సిటీ మాదిరిగా రెండు కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేస్తామని అన్నారు. పార్కుల ఏర్పాటు కొరకు స్థల పరిశీలన జరుగుతుందన్నారు. హైదరాబాద్ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కేంద్రంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త ఐటీ పార్కులను అభివృద్ధి చేయనుంది.
Similar News
News December 5, 2025
GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 5, 2025
నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు: శశిథరూర్

ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గొంతు వినిపించేందుకు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ‘పార్టీలో నాది ఏకైక గొంతు కావచ్చు. కానీ పార్లమెంటులో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికే నన్ను ఎన్నుకున్నారు. అరవడానికో, గొడవలు చేయడానికో కాదు. వారి కోసం, దేశం కోసం మాట్లాడేందుకు పంపించారు’ అని అన్నారు.
News December 5, 2025
సాకారం దిశగా మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్కు లైన్ క్లియర్ అవుతోంది. MP వల్లభనేని బాలశౌరి కృషి ఫలిస్తోంది. మచిలీపట్నం-రేపల్లెకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 45 KM మేర రైల్వే లైన్ ఏర్పాటుకు DPR తయారీకి ఫీల్డ్ సర్వే పనులు జరుగుతున్నాయని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


