News June 11, 2024

త్వరలో వనదేవతల స్మృతి వనం?

image

మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మక్క-సారలమ్మల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేలా గద్దెల వెనకవైపు ఉన్న 25 ఎకరాల్లో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది. జాతర విశేషాలతో పాటు.. అప్పటి వస్తువులు, వారి గొప్పతనం తెలిపేలా మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్ట సుందరీకరణతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.

Similar News

News October 4, 2024

వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కి నేడు శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ధరలు మాత్రం నిన్నటి లాగే తటస్థంగా ఉన్నాయి. గురువారం క్వింటా పాత పత్తి ధర రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్తపత్తికి నిన్న రూ.6,925 ధర రాగా నేడు రూ.6,925 అదే ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News October 4, 2024

మలుగు: రోడ్డుపై భారీ కొండచిలువ

image

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి కుమ్మరిగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కొండచిలువ గురువారం రాత్రి ప్రత్యక్షమైంది. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 10 అడుగుల పొడవు ఉందని స్థానికులు తెలిపారు. కాగా ప్రయాణికుల చప్పుడుతో పొదల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

News October 3, 2024

వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన

image

వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.