News April 15, 2025
త్వరలో విజయవాడ నుంచి సీ ప్లేన్ సేవలు

విజయవాడ నుంచి శ్రీశైలం, హైదరాబాద్‌కు సీ ప్లేన్ సేవలు ప్రారంభించేలా ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. దీని నిర్వహణకు అవసరమైన DPRను సంబంధిత సంస్థ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పున్నమిఘాట్ సమీపంలో సీ ప్లేన్ నిర్వహణకు అనుగుణంగా ఏరోడ్రోమ్ ఏర్పాటు కానుండగా.. శ్రీశైలం డ్యామ్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద సీ ప్లేన్ బేస్ సైతం సిద్ధం చేస్తున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Similar News
News October 23, 2025
ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కనుకులగిద్ద యువకుడు

హుజురాబాద్ మండలం కనుకులగిద్దకి చెందిన మొగిలిచర్ల కిషోర్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రామానికి వన్నె తెచ్చిన కిషోర్‌ను కనుకులగిద్ద డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అకుంటిత దీక్షతో 5 ఉద్యోగాలు సాధించిన కిషోర్ గ్రామానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. కిషోర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామ యువతకు సూచించారు.
News October 23, 2025
ఒంగోలు: 16 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో 16 మందికి కారుణ్య కోటాలో నియామక పత్రాలను అందించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు.
News October 23, 2025
రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.