News February 12, 2025
త్వరలో NZBలో ఎన్నికలు.. MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?

✓ బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు, క్రమ సంఖ్య చూసుకోవాలి.✓ వెళ్ళేటపుడు మీ ఐడీ కార్డు తీసుకొని వెళ్ళాలి.✓ బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.✓ పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.✓ మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉంటాయి.✓ మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి.✓ ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు వేయవచ్చు.
Similar News
News November 21, 2025
NZB: గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రైలులో గుట్కా ప్యాకెట్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు NZB రైల్వే సీఐ సాయిరెడ్డి తెలిపారు. GRP, RPF సిబ్బంది కలసి ఫ్లాట్ ఫారం నంబర్-1పై తనిఖీలు చేస్తుండగా NZB ఆటోనగర్కు చెందిన అబ్దుల్ అనీస్ నిషేధిత టోబాకో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 80 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
News November 20, 2025
నిజామాబాద్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి, రెంజల్, డొంకేశ్వర్, ఆలూర్, నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, వేల్పూర్, మాక్లూర్, జక్రాన్ పల్లి, ఏర్గట్ల, కోటగిరి, పొతంగల్, వర్ని, మోస్రా మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 20, 2025
అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

అక్రమ కేసులతో బీఆర్ఎస్, కేటీఆర్ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.


