News March 14, 2026
థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News April 13, 2026
ఆదిలాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా..!

ఆదిలాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో తీవ్రంగా వెనుకబడింది. మొదటి సంవత్సరంలో 32వ ర్యాంకు (50.77%), ద్వితీయ సంవత్సరంలో 33వ ర్యాంకు (62.50%) సాధించింది. ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బాలుర ఉత్తీర్ణత తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పర్యవేక్షణ లోపం, విద్యార్థుల గైర్హాజరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. 32వ స్థానంలో ADB

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ADB జిల్లా 50.77% ఉత్తీర్ణతతో 32వ స్థానంలో నిలిచింది. మొత్తం 7,701 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,910 మంది పాస్ అయ్యారు. బాలురు 3,773 మంది పరీక్ష రాయగా 1,391 మంది 36.87% పాస్ అయ్యారు. బాలికలు 3,928 మందికి గాను 2519 మంది 64.13% ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఒకేషనల్‌లో 935 మంది పరీక్ష రాయగా 620 మంది పాసై 66.31 శాతంతో స్టేట్‌లో 9వ స్థానంలో నిలిచింది.


