News August 11, 2024
థాయిలాండ్ వేదికపై మెరిసిన గాజువాక చిన్నారి
థాయిలాండ్‌లో ప్రపంచ దేశాల పిల్లల మధ్య జరిగిన మోడలింగ్ పోటీల్లో గాజువాకకు చెందిన చిన్నారి చిహ్నిక తన విశేష ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. వివిధ దేశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతల మధ్య జరిగిన హోరాహోరీగా జరిగిన పోటీల్లో సీనియర్ టోడ్లర్ విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. దీంతో పాటు ఎక్ట్రమ్ టాలెంట్, బెస్ట్ ఇంట్రడక్షన్ సబ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుని శభాశ్ అనిపించుకుంది.
Similar News
News September 14, 2024
BREAKING: విశాఖలో భారీ అగ్నిప్రమాదం
విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఓ కంటైనర్‌లోని లిథియం బ్యాటరీలు పేలడంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
విశాఖ: 24 నుంచి ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలు
ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలను ఈనెల 24 నుంచి 27 వరకు విశాఖలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 78వ పురుషులు, మహిళల 17వ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ప్రముఖ బాక్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.
News September 14, 2024
సీఎం నివాసం వద్ద విశాఖ జిల్లా మహిళ ఆవేదన
విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్‌లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.