News January 29, 2025
దండేపల్లి: పొలం దున్నుతుండగా బయటపడ్డ సూర్య చంద్ర విగ్రహాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేటలో శివారులో అద్భుతం చోటు చేసుకుంది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపంలోని పంట పొలంలో బుధవారం పొలం దున్నుతుండగా సూర్య, చంద్ర విగ్రహాలు బయటపడ్డాయి. ఒకేరాయిపై ఈ విగ్రహాలు చెక్కబడి ఉండటం విశేషం. దీంతో విగ్రహాలను చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. విగ్రహాలకు పూజలు చేస్తున్నారు.
Similar News
News January 5, 2026
ఖమ్మంలో తగ్గిన కోడిగుడ్ల ధరలు..!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.38, వంకాయ 26, బెండకాయ 40, పచ్చిమిర్చి 38, కాకర 46, కంచకాకర 50, బోడకాకర 140, బీరకాయ 50, సొరకాయ 26, దొండకాయ 46, క్యాబేజీ 24, ఆలుగడ్డ 24, చామగడ్డ 28, క్యారెట్ 40, బీట్ రూట్ 24, కీరదోస 26, బీన్స్ 56, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 45, కోడిగుడ్లు(12) రూ.80 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
News January 5, 2026
MECON లిమిటెడ్‌లో 44 పోస్టులు

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News January 5, 2026
స్కూళ్లలో ఆధార్ క్యాంపులు.. ఉచితంగా అప్‌డేట్

AP: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. 5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఇంకా 16.51L మంది స్టూడెంట్స్ ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు.


