News January 29, 2025

దండేపల్లి: పొలం దున్నుతుండగా బయటపడ్డ సూర్య చంద్ర విగ్రహాలు

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేటలో శివారులో అద్భుతం చోటు చేసుకుంది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపంలోని పంట పొలంలో బుధవారం పొలం దున్నుతుండగా సూర్య, చంద్ర విగ్రహాలు బయటపడ్డాయి. ఒకేరాయిపై ఈ విగ్రహాలు చెక్కబడి ఉండటం విశేషం. దీంతో విగ్రహాలను చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. విగ్రహాలకు పూజలు చేస్తున్నారు.

Similar News

News February 18, 2025

మాల మహానాడు ఉమ్మడి జిల్లాల విస్తృత సమావేశాలు

image

మాలమహానాడు ఉమ్మడి జిల్లాల విస్తృత సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల విస్తృత సమావేశం ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తృత సమావేశ తేదీలను నాయకులు తెలిపారు.

News February 18, 2025

రాత్రి 7 గంటలకు వంశీ కేసులో నిజాలు వెల్లడిస్తాం: YCP

image

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్‌కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుకి సంబంధించి Xలో వైసీపీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈరోజు రాత్రి 7 గంటలకు కేసు వెనక ఉన్న అసలు నిజాలు బయటపెడతామని తెలిపింది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News February 18, 2025

శ్రీ సత్యసాయి: చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!