News March 11, 2025

దండేపల్లి: భర్త చనిపోయి 4 ఏళ్లు.. అయినా పెన్షన్ రాలేదు

image

తన భర్త మరణించి నాలుగు సంవత్సరాలు పూర్తయినా పెన్షన్ రావడంలేదని జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన చింతగుంట్ల పోశవ్వ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేసుకొని బతుకుతున్న తనకు భర్త చనిపోవడంతో బతుకుభారంగా మారిందన్నారు. కనీసం పెన్షన్ అయిన వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తే 4 ఏళ్లు గడిచినా పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

Similar News

News November 17, 2025

NIMSలో నర్సులకు డయాబెటిస్ సంరక్షణపై ప్రత్యేక శిక్షణ

image

వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సోమవారం నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం నర్సింగ్ సిబ్బంది కోసం ‘డయాబెటిక్ పేషెంట్ కేర్’ పై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. హెచ్.ఓ.డి. ప్రొఫెసర్ ఎం.వి.ఎస్. సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మధుమేహ రోగుల కౌన్సెలింగ్, ఇన్సులిన్ వినియోగం, డయాబెటిక్ కిటోఆసిడోసిస్ (DKA), హైపోగ్లైసీమియా వంటి అత్యవసర పరిస్థితుల నిర్వహణపై లోతైన అవగాహన కల్పించారు.

ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో జమ: జేసీ

image

ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మద్దతు ధర నేరుగా జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జేసీ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,240 మంది రైతులకు రూ.55.82 కోట్లు జమ చేసినట్లు సోమవారం రాజమండ్రిలో ఆయన వివరించారు. రైతులకు ఏ సమస్య ఎదురైనా వెంటనే 8309487151 నంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలు, ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు.