News November 6, 2024
దండేపల్లి: రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి

దండేపల్లి మండలంలోని మేదర్ పేట రోడ్డుపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మేదరిపేటలో రోడ్డుపై ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని లక్సెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లికి చెందిన బోనాల మహేశ్ (34) అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు కార్పెంటర్గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 2, 2025
ఆదిలాబాద్: పెంపుడు శునకానికి పురుడు

ఆదిలాబాద్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఏలేటి నర్సారెడ్డి పటేల్, నాగమ్మ దంపతులు ఇంట్లో ఓ కుక్కను పెంచుకుంటున్నారు. అది నవంబర్ 12న ప్రసవించింది. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇవాల్టికి 21వ రోజు కావడంతో ఆ శునకానికి పురుడు చేసి.. కుక్క పిల్లలకు నామాకారనోత్సవం చేశారు. అనంతరం శునకానికి నైవేద్యం సమర్పించారు.
News December 1, 2025
నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
News December 1, 2025
అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం: SP

షీ టీం విస్తృత అవగాహన ద్వారా ప్రజలు, విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. నెల రోజులలో షీ టీం ద్వారా 4 ఎఫ్ఐఆర్, 30 ఈ పెట్టీ కేసులు నమోదు చేసి ఆకతాయిలను అడ్డుకున్నామన్నారు. గ్రామాలలో మహిళలకు, పాఠశాలలలో విద్యార్థులకు సోషల్ మీడియా క్రైమ్, మహిళల పట్ల నేరాల పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే 8712659953 నంబర్ను సంప్రదించాలన్నారు.


