News January 26, 2025

దండేపల్లి వాసికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు

image

దండేపల్లి మండలం ముత్యంపేటకి చెందిన శంకరయ్య- దేవక్కల పెద్ద కుమారుడు తిరుపతి శనివారం బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును రవీంద్రభారతిలో అందుకున్నారు. ఆయన 2007లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. 2017లో హైదరాబాద్ సీఐగా బాధ్యతలు స్వీకరించి CID విభాగంలో ఇన్స్పెక్టర్‌గా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన పోలీసు అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలందించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

Similar News

News November 24, 2025

WGL: రీకౌంటింగ్.. తొలిసారి ఐదుగురు పాస్!

image

వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ చరిత్రలో రీకౌంటింగ్ పెడితే తొలిసారి ఫెయిలైన ఐదుగురు పీజీ వైద్య విద్యార్థులు మళ్లీ ఉత్తీర్ణులు కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఈ విద్యార్థులు పాస్ కావడానికి, యూనివర్సిటీలో అక్రమంగా మార్కులు కలిపారని, డబ్బులు తీసుకొని పాస్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం గత నెల 4న ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కొనసాగుతోంది.

News November 24, 2025

తిరుచానూరులో పంచమి తీర్థం.. పటిష్ఠ భద్రత

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 25న మంగళవారం పంచమి తీర్థం జరగనుంది. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో టీటీడీ, పోలీస్ శాఖ భద్రత కట్టుదిట్టం చేసింది. టీటీడీ విజిలెన్స్ 600 మంది, స్కౌట్ అండ్ గైడ్స్ 200 మంది, NCC విద్యార్థులు 200 మంది, శ్రీవారి సేవకులు 900 మంది, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

News November 24, 2025

NRPT: 108లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

image

EMRI (108) అంబులెన్స్ సేవలో EMT పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా సూపర్వైజర్ రాఘవేంద్ర తెలిపారు. అర్హతలు: B.Sc (BZC), B.Sc నర్సింగ్, GNM, B.ఫార్మా, D.ఫార్మా, DMLT, MLT వయసు 30 ఏళ్లు, మంగళవారం మక్తల్‌లో జరిగే ఇంటర్వ్యూల ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని తెలిపారు. నర్వ, మక్తల్ మాగనూరు, కృష్ణ మండలాల అంబులెన్స్‌లలో విధులు ఉంటాయన్నారు.