News February 28, 2025
దంతాలపల్లిలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభ

దంతాలపల్లి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు. మండల కేంద్రంలో ర్యాలీ తీసి అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
గ్రేటర్ వరంగల్లో డివిజన్ల పెంపునకు ప్రతిపాదనలు!

గ్రేటర్ వరంగల్ సమీప ప్రాంతాలు మరోసారి విలీనం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లకు అదనంగా మరో 22 డివిజన్లను పెంచాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మడికొండ, రాంపూర్ దాటిన నగరం పెండ్యాల వరకు పెంచాల్సి వస్తోంది. దీంతో పాటు గీసుగొండ, దామెర, ఎల్కతుర్తి, ఐనవోలు వరకు విస్తరణ ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విలీన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
News December 10, 2025
టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 10, 2025
WGL: కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్-1పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.


