News February 3, 2025
దంతాలపల్లి: వ్యవసాయ బావిలో మృతదేహం

దంతాలపల్లి మండల కేంద్రంలోని యెల్లు సోమిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో గ్రామానికి చెందిన నాగిరెడ్డి రఘునందన్ రెడ్డి(69) అనే వృద్ధుడు మృతదేహం కనిపించింది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Similar News
News September 16, 2025
సంగారెడ్డి: ఇన్స్పైర్ నామినేషన్ గడువు పెంపు

ఇన్స్పైర్ అవార్డ్స్ (Inspire Awards) నామినేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు, జిల్లా, డివిజన్, మండల మానిటరింగ్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.
News September 16, 2025
రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్వర్క్ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.