News April 9, 2025

దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

image

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. 

Similar News

News November 5, 2025

విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

image

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

News November 5, 2025

గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

image

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.

News November 5, 2025

ఆరిలోవ రైతు బజార్‌లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

image

ఆరిలోవ రైతు బజార్‌లో ఖాళీగా ఉన్న స్టాళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. అక్టోబర్ 22న డ్రా ద్వారా 50 మంది రైతులకు స్టాళ్లు కేటాయించగా.. నేడు డ్వాక్రా సభ్యుల కోసం 10 స్టాళ్లు, వికలాంగుల కోసం ఒక స్టాల్ కేటాయించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించి తుది కేటాయింపులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు