News July 17, 2024
దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య

గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI రాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తునికినూతల గ్రామానికి చెందిన వడ్త్యా శ్రీని, పద్మజల దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. నగరానికి కొన్నేళ్లక్రితం వచ్చి నాదర్గుల్లో నివాసం ఉంటున్నారు. సోమవారం శ్రీని, పద్మజ మధ్య డబ్బుల విషయమై గొడవ జరిగింది. దీంతో పద్మజ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News November 21, 2025
దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్కు బదిలీ

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
News November 21, 2025
NLG: వడివడిగా అడుగులు… ఏర్పాట్లపై ఈసీ కసరత్తు

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడుగులు చకచకా పడుతున్నాయి. తొలుత GP ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి రాగా ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 23న జిల్లాలో ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేయనున్నారు. ఇతర ఏర్పాట్లపైనా దృష్టి సారించగా.. ఈనెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
News November 21, 2025
NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.


