News March 21, 2025
దంపతుల హత్య కేసులో పలువురికి శిక్ష:SP

దంపతుల దారుణ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించినట్లు వికారాబాద్ SP నారాయణరెడ్డి తెలిపారు. ధారూర్ PS పరిధిలోని నాగసముందర్ కు చెందిన చిన్న నర్సింహులు, అంజమ్మలను అదే గ్రామానికి చెందిన బంధప్పతో పాటుగా ఆరుగురుతో కలిసి దాడి చేసి చంపారు. ఈ కేసులో పలువురికి జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News March 22, 2025
భద్రాద్రి: ఇంకుడుగుంతలతో.. నీటిని ఒడిసిపడుదాం!

నీరు మానవాళి ఆరోగ్యానికి శ్రేయస్కరం. కానీ బాధ్యతారాహిత్యంతో దుర్వినియోగమవుతుండగా, మార్చి 22న జల దినోత్సవం నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో భద్రాద్రి జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా యంత్రాంగం ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, మినీ వాటర్ హోల్స్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అలాగే చెరువులు, కుంటలనూ పునరుద్ధరించాలి. నీటి వృథాపై పిల్లలకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తు అవసరాలకు ఢోకా లేనట్లే.
News March 22, 2025
ఆదిలాబాద్: ఈ నెల 24న JOB MELA

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్‌లో ఈ నెల 24న TSKC ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, TSKC కోఆర్డినేటర్ డా.శ్రావణి, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. HDFC Bank & Axis Bankలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ ఉండి 30ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.
News March 22, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గి సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. కాగా, రెండు రోజుల్లోనే వెండీ ధర ఏకంగా రూ.4100 తగ్గడం విశేషం.