News March 7, 2025
దక్షిణ చిరువోలు లంకలో రీ సర్వే పరిశీలించిన కలెక్టర్

అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంకలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలించి అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూమి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్), భూమి ధ్రువీకరణ (గ్రౌండ్ వాలిడేషన్) ప్రక్రియ సక్రమంగా జరిగితే రీ సర్వేలో నాణ్యమైన ఫలితాలు పొందవచ్చన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 15, 2025
పది ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ ఛైర్‌పర్సన్

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్ హాలులో 1 నుంచి 7 వరకు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత జడ్పీ చైర్ పర్సన్ జడ్పీటీసీలు, జిల్లా అధికారులచే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.
News March 15, 2025
కృష్ణా: నేటి నుంచి ఒంటి పూట బడులు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7:45నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయని పేర్కొన్నారు.
News March 14, 2025
బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.