News February 2, 2025
దక్షిణ భారత సైన్సు ఫెయిర్‌లో ములుగు విద్యార్థినుల ప్రతిభ

జనవరి 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌లో ములుగులోని సాధన హై స్కూల్ విద్యార్థినులు లక్ష్మి ప్రసన్న, గౌతమిలు ప్రతిభ కనబరిచి స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ములుగు జిల్లా తరఫున ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో నాచురల్ ఫార్మింగ్ థీమ్ చేసిన ఆవిష్కరణకు ఈ గుర్తింపు లభించింది. గైడ్ టీచర్ ప్రణీత్, కరస్పాండెంట్ సురేందర్‌ను డీఈవో పాణిని, డీఎస్ఓ జయదేవ్ అభినందించారు.
Similar News
News February 16, 2025
చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 16, 2025
తునిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

తుని పట్టణంలోని డీ మార్ట్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐచర్ వ్యానును బైకు వెనుకనుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తలకు బలమైన గాయం తగిలింది. క్షతగాత్రుడిని తుని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారని తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.
News February 16, 2025
బెల్లంపల్లి: చర్లపల్లి అటవీ పరిధిలో పెద్దపులి

గత 15 రోజులుగా బెల్లంపల్లి, తాండూర్ మండల ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి తాజాగా మండలంలోని చర్లపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖాధికారి పూర్ణచంద్ర తెలిపారు. ఆదివారం ఉదయం చర్లపల్లి అటవీ ప్రాంత పరిధిలో పులి పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి పశువులను మేపేందుకు వెళ్ళవద్దన్నారు. గుంపులు, గుంపులుగా ఉండాలన్నారు.