News January 4, 2025
దగదర్తి ఎయిర్పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. గతంలో జిల్లాలో దగదర్తి విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని కార్యాచరణను రూపొందించి 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన 745 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈప్రాంతంలో BPCL చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్లో ఎయిర్ స్ట్రిప్ను తేవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.
Similar News
News November 13, 2025
నెల్లూరు: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

యువతి ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులున్న ఈ సమాజంలో విజయవాడ ఆటోడ్రైవర్లు మానవత్వం చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వేదనకు గురై నెల్లూరు నుంచి విజయవాడ చేరుకుని యువతికి అండగా నిలిచారు. పర్సు పొగొట్టుకుని, ఫోన్, డబ్బుల్లేక బస్టాండ్లో ఆకలితో అలమటిస్తున్న ఆమెకి అండగా నిలిచారు. పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను సురక్షిత కేంద్రానికి చేర్చిన ఆటో వాలాలపై అభినందనలు వస్తున్నాయి.
News November 13, 2025
నెల్లూరు: సాయం కోసం 12,293 మంది రైతుల ఎదురుచూపులు

అన్నదాత సుఖీభవ కింద ఖాతాలకు జమ కావలసిన రూ.20 వేల కోసం నెల్లూరు జిల్లాలోని 12,293 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా రైతులకు జమ అయింది. కానీ సాంకేతిక కారణాలతో జమ కాని 12,293 మంది రైతులు సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా ఆగినవి కాకుండా మిగిలిన అన్నీ కూడా అధికారులు తగిన శ్రద్ధ చూపిస్తే సత్వరమే పరిష్కారం అయ్యేవేనని సమాచారం..
News November 13, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

నెల్లూరు లేడీ డాన్ అరుణను పోలీస్ కస్టడికి ఇచ్చేందుకు విజయవాడ కోర్ట్ బుధవారం అనుమతి ఇచ్చింది. వారంపాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా… కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను 13,14 తేదీల్లో విచారించేందుకు సూర్యారావు పేట పోలీసులు తీసుకెళ్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదు అయింది.


