News January 4, 2025

దగదర్తి ఎయిర్‌పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. గతంలో జిల్లాలో దగదర్తి విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని కార్యాచరణను రూపొందించి 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన 745 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈప్రాంతంలో BPCL చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్‌ను తేవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.

Similar News

News July 6, 2025

నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

image

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

News July 5, 2025

రొట్టెల పండుగకు 1,700 మంది పోలీసు సిబ్బంది: IG

image

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.‌

News July 5, 2025

నెల్లూరు: చిన్నారుల కోరిక.. స్పందించిన లోకేశ్

image

నెల్లూరు VR స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తామూ చదువుకుంటామని కమిషనర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేశ్ ‘X’ వేదికగా స్పందించారు. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. ‘పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక సాధనం విద్య. చిన్నారులు కలలను సాకారం చేసుకునేందుకు అన్ని విధాల అండగా నిలుస్తాం’ అని ఆయన వెల్లడించారు.