News July 17, 2024
దగదర్తి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దగదర్తితో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.
Similar News
News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 19, 2025
నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
నెల్లూరు: సంగం వద్ద RTC బస్సుకు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా సంగం వద్ద RTC బస్సుకు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. షాట్ సర్క్యూట్‌తో బస్సుకింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మంటలు గమనించి బైక్‌తో బస్సును చేజ్ చేసి ఆపాడు. అనంతరం బస్సులోని వారందరినీ డ్రైవర్ కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


