News March 29, 2024
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రాజకీయ ప్రస్థానం

అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈయన 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పని చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసినప్పటికీ ఎటువంటి పదవులు అధిరోహించలేదు. వెంకటేశ్వర ప్రసాద్ పని తీరుని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.
Similar News
News January 5, 2026
ఈ నెల 6, 7వ తేదీలలో ఇంటర్వ్యూలు

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.
News January 4, 2026
అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.