News March 29, 2024

దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ రాజకీయ ప్రస్థానం

image

అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈయన 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పని చేశారు. పార్టీ కోసం కష్టపడి పని చేసినప్పటికీ ఎటువంటి పదవులు అధిరోహించలేదు. వెంకటేశ్వర ప్రసాద్ పని తీరుని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.

Similar News

News March 5, 2026

బుక్కరాయసముద్రం: 10 నుంచి ఉచిత శిక్షణ

image

బుక్కరాయ సముద్రం ఆర్డీటీ స్కూల్లో ఈ నెల 10వ తేదీ ఇగ్నైట్ వ్యాపార శిక్షణ నిర్వహిస్తున్నట్లు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో చంద్రమౌళి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా మార్చడానికి ఐదు రోజులు శిక్షణ అందిస్తున్నామన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు గల దివ్యాంగులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. ఉచిత వసతి, భోజనం సదుపాయాలు కల్పిస్తామన్నారు.

News March 5, 2026

తాడిపత్రిలో రైలు పట్టాలపై పడుకుని..!

image

తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి గురువారం హల్‌చల్ చేశాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. అనంతరం ఆ వ్యక్తిని హెచ్చరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సుమారు 10 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకుంది.

News March 5, 2026

అనంత: పక్కాగా జనగణన

image

అనంతపురం జిల్లాలో 16వ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మొదటి దశలో హౌస్ లిస్టింగ్ నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని చెప్పారు. డేటా సేకరణలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.