News November 16, 2024

దత్తిరాజేరు: ‘ప్రభుత్వ స్కూల్లో చదివి కలెక్టర్ అయి వచ్చాడు’

image

దత్తిరాజేరు జెడ్పీ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి ఎం.కూర్మారావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. కూర్మారావు సొంత ఊరు అయిన పొరలికి వచ్చి, దత్తిరాజేరు స్కూల్‌ను శనివారం పరిశీలించారు. జిల్లా అధికారి మాణిక్యం నాయుడు, మండల ఎంఈఓ వెంకట్రావు, స్కూల్ హెచ్ఎం స్వర్ణ కలెక్టర్‌కు ఘనంగా స్వాగతించి అభినందనలు తెలిపారు.

Similar News

News December 11, 2024

విజయనగరం పట్టణంలో ఆక్రమణలు తొలగింపు 

image

విజయనగరంలోని సాలిపేట రహదారిలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆదేశాలతో పట్టణ ప్రణాళిక సిబ్బంది మంగళవారం తొలగించారు. ఎన్సీఎస్ థియేటర్ రోడ్‌లో అనధికార ప్రకటన బోర్డులను తొలగించారు. సాలిపేట రోడ్‌లో అనధికారికంగా నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రణాళిక విభాగం అధికారులు నిర్మాణ దశలోనే వాటిని అడ్డుకున్నారు. ఆక్రమణలను ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.

News December 10, 2024

విజయనగరంలో నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు

image

అలనాటి ప్రముఖ సినీ నటి సూర్యకాంతం కుటుంబ సభ్యులు విజయనగరంలో మంగళవారం పర్యటించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభ మూర్తి, కోడలు ఈశ్వరరాణి, తదితరులు గురజాడ అప్పారావు మ్యూజియాన్ని సందర్శించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ అప్పారావు ముని మనవడు గురజాడ ప్రసాద్ పాల్గొన్నారు.

News December 10, 2024

VZM: ‘ఆ కేసుల్లో రాజీ కుదర్చండి’

image

డిసెంబర్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎ అదాలత్‌లో పలు కేసుల్లో ఇరు వర్గాలకు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాజేశ్ కుమార్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు.