News March 29, 2024
దన్వాడ: తమ్ముడు మృతి.. పుట్టెడు దుఃఖంతో పరీక్ష హాలుకు
తమ్ముడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న విద్యార్థిని పరీక్షకు హాజరైంది. మరికల్‌కు చెందిన అనూషకు గురువారం పదో తరగతి సైన్స్ పరీక్ష ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడు అర్జున్ మృతిచెందాడు. పరీక్షకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉండగా.. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఓదార్చి అనూషను పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాయించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొంది.
Similar News
News January 19, 2025
MBNR: ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలనపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
News January 19, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి సాగు
✔అయిజ:BRS కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిక
✔అచ్చంపేట:మూడు కార్లు ఢీ.. ఒకరు మృతి
✔ఘనంగా Sr. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
✔ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
✔అచ్చంపేట:కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
✔NGKL: ఉమామహేశ్వర స్వామికి నంది వాహన సేవ
✔డ్రంక్ అండ్ డ్రైవ్..పోలీసుల తనిఖీలు
✔రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్ విడుదల
✔క్రీడా బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యేలు
News January 18, 2025
MBNR: ప్రేమను ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య
మహ్మదాబాద్ మండలం ధర్మాపూర్‌కు చెందిన పెద్దలు యువతి ప్రేమను కాదన్నారని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. MBNRలోని ఓ కళాశాలలో నర్సింగ్ చదువుతున్న గ్రామానికి చెందిన నవనీత(19) ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలిసి యువతి ఇంట్లో వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.