News February 11, 2025
దమ్మపేట: యువకుడిపై పోక్సో కేసు

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన ఓ విద్యార్థినిని మందలపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర బార్గవ్ లైంగికంగా వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
Similar News
News October 16, 2025
WGL: హెల్మెట్ ధరించడం నియమం కాదు.. జీవన రక్షణ!

హెల్మెట్ ధరించడం కేవలం రూల్స్ పాటించడం కాదు, జీవాన్ని విలువైనదిగా భావించే బాధ్యతగా చూడాలని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి రైడ్లో జాగ్రత్తగా, సమర్థంగా వ్యవహరించడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి బైక్ రైడ్కు ముందు హెల్మెట్ ధరించడం మన జీవితాన్ని సురక్షితంగా ఉంచే మొదటి అడుగని వారు సూచించారు.
News October 16, 2025
MHBD: పత్తి రైతుకు తిప్పలు తప్పవా..!

పత్తిని అమ్ముకోవాలంటే రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడంతో పత్తి రైతుకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు లేని, చదువు రాని రైతులకు ఈయాప్ వాడటం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు యాప్పై అవగాహన సదస్సులను నిర్వహించాలని,అకాల వర్షాలకు భారీగా పత్తి పంటలు దెబ్బతిన్నాయని, పండిన కొద్దిపాటి పత్తిని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందిగా మారింది.
News October 16, 2025
మెదక్: 49 మద్యం దుకాణాలు.. 276 దరఖాస్తులు

మెదక్ జిల్లాలోని మొత్తం 49 మద్యం దుకాణాలకు బుధవారం వరకు 276 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు ఎస్సీ, ఎస్టీ, గౌడ్లకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.