News February 11, 2025

దమ్మపేట: యువకుడిపై పోక్సో కేసు

image

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన ఓ విద్యార్థినిని మందలపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర బార్గవ్ లైంగికంగా వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.

Similar News

News April 17, 2026

నెల్లూరు: వాట్సాప్‌లో ఒక్క క్లిక్.. రూ.2.58 లక్షలు హాంఫట్

image

వాట్సాప్‌లో ‘సేవింగ్స్ ఆన్‌లైన్ మార్కెటింగ్’ పేరుతో వచ్చిన సందేశాన్ని క్లిక్ చేసిన ఓ యువతి రూ. 2.58 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన నవబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నితేశ్ అనే వ్యక్తి ఓ యువతికి పంపిన APK ఫైల్‌ను ఓపెన్ చేయగానే ఆమె బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది. గుర్తుతెలియని లింకులు, ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బాపట్ల: నైట్ ప్యాంటుతో ఆఫీసుకు.. సస్పెండ్

image

నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గడువు తీరిన 11 అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.