News April 9, 2025
దమ్మాయిగూడలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

దమ్మాయిగూడలో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. SI అలీ తెలిపిన వివరాలిలా.. అంజనాద్రి నగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం నడుస్తుందనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. కొందరు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువతులు, మల్కాజిగిరికి చెందిన యువకుడు, ఇతర రాష్టాల నుంచి వచ్చిన కొందరు కొంతకాలంగా వ్యభిచారం నడుపుతున్నారని.. నిందితులను అరెస్ట్ చేసి యువతులను ప్రజ్వల హోమ్‌కి తరలించారు.
Similar News
News December 4, 2025
WGL: గుర్తులొచ్చాయ్.. ఉదయం 6 నుంచే షురూ

వరంగల్: పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్‌కు వారం రోజులే సమయం ఉండడం, బుధవారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ, తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు.
News December 4, 2025
పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.
News December 4, 2025
హనీమూన్ వెకేషన్లో సమంత-రాజ్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.


