News July 15, 2024
దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి మీ మాటలు: గొట్టిపాటి
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎద్దేవ చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఇసుక ధరలకు మీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని ఆగ్రహించారు.
Similar News
News October 13, 2024
ప్రకాశం జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను వలన ముప్పు వాటిల్లకుండా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలోని పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.
News October 13, 2024
ప్రకాశం జిల్లాలో ‘కిక్కు’ ఎవరికో
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు ఈ నెల 12తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 171 మద్యం షాపులకు గాను 3416 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమక్షంలో మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుంది. మొదటి రోజే మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలని నిబంధనలో ఉంది.
News October 13, 2024
పండుగపూట కూడా అరాచకం: ఎమ్మెల్యే తాటిపర్తి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వంలో పండుగపూట కూడా అరాచకం. శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం నల్లబొమ్మయ్య పల్లిలో వాచ్‌మెన్, అతని కొడుకును ఐదుగురు కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై అత్యాచారం చేసిన కామాంధులు. రాష్ట్రంలో కామాంధులు నుంచి ఆడబిడ్డలకి మీరు కల్పించే రక్షణ ఇదేనా?’ అంటూ పోస్ట్ చేశారు.