News April 12, 2025
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: ASF అదనపు కలెక్టర్

నిరుద్యోగ యువత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ASF అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం వాంకిడి ఎంపీడీఓ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవాకేంద్రాన్ని ఆయన సందర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.
News July 8, 2025
కామారెడ్డి మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్

కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వాల్యను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్స్ విభాగంలో హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ డా.వాల్య ప్రమోషన్ పై జిల్లా మెడికల్ కళాశాలకు పిన్సిపల్‌గా రానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News July 8, 2025
మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.