News February 18, 2025

దరఖాస్తులను 20 నాటికి అందించాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారులు నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఈనెల 20 నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరే విధంగా అందించాలన్నారు.

Similar News

News March 19, 2025

గుంటూరు: వక్కపొడి సంస్థ కార్యాలయాలపై దాడులు 

image

గుంటూరులోని ఓ ప్రముఖ వక్కపొడి సంస్థ కార్యాలయాలపై నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బుధవారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. గుంటూరులోని ఆ సంస్థ ఛైర్మన్ నివాసంలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీల్లో 40కిలోల బంగారం, 100 కిలోల వెండి, రూ.18లక్షల నగదు సీజ్ చేసినట్టు సమాచారం. వక్కపొడి ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. 

News March 19, 2025

గుంటూరు: మంచినీటి చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ 

image

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రంను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్‌కే ఖాజావలీ, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, కలెక్టరేట్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

News March 19, 2025

కొల్లిపర: పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్  

image

కొల్లిపరలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొల్లిపర పాఠశాలను సెన్సిటివ్ జాబితాలో ఎందుకు చేర్చారని అధికారులను ప్రశ్నించారు. 

error: Content is protected !!