News January 24, 2025

దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

image

రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను జనగామ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ పరిశీలించారు. శుక్రవారం స్టే.ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆన్‌లైన్ ప్రక్రియన పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని గ్రామాల దరఖాస్తులను ఆన్ లైన్ చేశారు, ఇంకెన్ని గ్రామాలు చేయాలని అడిగి తెలుసుకున్నారు.ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా ఆన్‌లైన్ చేయాలని, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన సూచించారు.

Similar News

News February 10, 2025

MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

image

మంచిర్యాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో గతంలో 130 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 3 స్థానాలు విలీనమయ్యాయి. దీంతో కొత్తగా భీమిని, భీమారం మండలాల్లో అదనంగా 2 స్థానాలను పెంచారు. కాగా జిల్లాలో మొత్తం మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలు, 16 జడ్పీటీసీ స్థానాలు, 16 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి.

News February 10, 2025

జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

YCP అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌(NCLT)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మార్చి 6కు వాయిదా పడింది. ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తరఫు లాయర్లు సమయం కోరారు. సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్ల ప్రక్రియను రద్దు చేయాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News February 10, 2025

కావలి: కస్తూర్బా ఘటనపై హోంమంత్రి అనిత ఆరా!

image

కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.

error: Content is protected !!