News January 24, 2025

దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలి: కలెక్టర్

image

ప్రజాపాలన గ్రామ/వార్డు సభల అభ్యంతరాల దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మండల పరిషత్, తహశీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ/వార్డు సభల్లో వచ్చిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే పరిశీలన, అభ్యంతరాల దరఖాస్తుల వివరాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.

Similar News

News November 26, 2025

రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

image

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్‌కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/

News November 26, 2025

జగిత్యాల: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలి: ఎస్పీ

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.

News November 26, 2025

HYD: లోకల్ బాడీల్లో BRS ‘డబుల్ స్ట్రాటజీ’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమి తర్వాత, GP ఎలక్షన్స్‌లో గెలవడానికి BRS ప్రయత్నాలు మొదలెట్టింది. కాంగ్రెస్ పాలనలో GPలకు నిధుల కొరత, 42% BC కోటా అమలులో వైఫల్యాలని చెబుతూ ప్రచారంలో మెయిన్ ఎజెండాగా ప్లాన్ చేసింది. 2వ ఎజెండా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడం. KTR ఇప్పటికే ‘HILT’ పాలసీలో లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని లేవనెత్తారు. వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.