News April 14, 2025
దరఖాస్తు గడువు పొడిగించాలి: యూనుస్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఏఐఎస్ఎఫ్ జనగామ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నుంచి 3 రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో నిరుద్యోగులు కుల, ఆదాయ, నివాసం సర్టిఫికెట్ల తీసుకోలేక పోవడంతో పథకానికి దరఖాస్తు చేయలేకపోయారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గడువు పెంచాలని కోరారు.
Similar News
News January 11, 2026
రైతు భరోసా… ఇంకెంతకాలం నిరీక్షణ!

రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం జిల్లాలోని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదార్ రైతులు ఉండగా యాసంగి సీజన్‌పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది జనవరి 26నే ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా.. ఈసారి నవంబర్‌లో సీజన్ ప్రారంభమై ఈ నెలాఖరుకు ముగుస్తున్నా నిధుల ఊసే లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
News January 11, 2026
KNR: ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం: సీపీ

సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని KNR CP గౌష్ ఆలం సూచించారు. విలువైన ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం, బ్యాంక్ లాకర్లలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరెళ్లే సమాచారాన్ని పోలీసులకు తెలపాలని కోరారు. సోషల్ మీడియాలో పర్యటనల వివరాలు పంచుకోవద్దని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలన్నారు.
News January 11, 2026
కరీంనగర్: బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ

కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన రఫీక్ ఖాన్ రెండు రోజులకే బదిలీ అయ్యారు. జగిత్యాల వీఆర్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనను ఉన్నతాధికారులు సీసీఆర్‌బీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.


