News April 12, 2025
దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటు: హరీశ్ రావు

ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటుని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారాని, పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం Xలో పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Similar News
News April 14, 2026
మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ విడుదల

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
మెదక్: హైవేపై మరమ్మత్తులను పరిశీలించిన కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
మెదక్: వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి: కలెక్టర్

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.


