News February 9, 2025
దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే అరెస్టు అయిన ముద్దాయిలపై ఛార్జీ షీట్లు దాఖలు చేయాలన్నారు.
Similar News
News March 14, 2025
తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి: పవన్ కళ్యాణ్

AP: హిందీని తమిళనాడు వ్యతిరేకించడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘అలా అయితే తమిళ్ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి డబ్బులు కావాలి గానీ భాషలు వద్దా? భాషలపై వివక్ష ఎందుకు? సంస్కృతం, హిందీ మన భాషలే కదా? పనిచేసేవాళ్లు బిహార్ నుంచి రావాలి కానీ హిందీ మాత్రం వద్దా?’ అని పవన్ ప్రశ్నించారు.
News March 14, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి టాప్ NEWS!

@జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు @ఇటిక్యాల లో వెంకటేశ్వరా స్వామి రథోత్సవం @గ్రూప్ -2,3 లో సత్తాచాటిన బీర్పూర్ యువకుడు @కోటిలింగాల సన్నిధిలో జిల్లా విద్యాధికారి పూజలు@గ్రూప్ 1,3 ఫలితాల్లో రాయికల్ అరవింద్ ప్రతిభ @ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న DEO@కొండగట్టులో 26వ గిరి ప్రదక్షణ @ధర్మపురి నృసింహుని ఆలయంలో భక్తుల రద్దీ
News March 14, 2025
NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్కు భార్య, ఇద్దరు పిల్లలు.