News February 9, 2025
దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న లాంగ్ పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటికే అరెస్టు అయిన ముద్దాయిలపై ఛార్జీ షీట్లు దాఖలు చేయాలన్నారు.
Similar News
News April 17, 2026
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సర్జరీ పరీక్ష రద్దు

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.
News April 17, 2026
ఉమ్మడి వరంగల్‌లో జనాభా వివరాలు ఇలా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 36,88,217 మందిగా సర్వేలో తేలింది. ఇందులో వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉండగా, మహబూబాబాద్ 8,04,515, హనుమకొండ 7,99,448, జనగామ 5,45,449, జయశంకర్ భూపాలపల్లి 4,07,896, ములుగు జిల్లాలో అత్యల్పంగా 2,94,098 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా బీసీలు 18,37,374తో ముందుండగా, ఎస్సీలు 7,07,161, ఎస్టీలు 6,74,725, ఓసీలు 2,94,517 మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
News April 17, 2026
శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.


