News June 15, 2024

దర్శి: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థులు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన దర్శిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శి మండలం లంకోజినపల్లికి చెందిన నవీన్‌ (16), చందు (16)లు గురువారం ఇద్దరూ బయటకు వెళ్లారు. తర్వాత వీరిద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం దర్శిలోని ఎన్‌ఎపీ చెరువులో మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 18, 2024

ప్రకాశం: ‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని, అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.

News September 18, 2024

బాలినేని వైసీపీ వీడటానికి ఇవి కూడా కారణమయ్యాయా..?

image

బాలినేని శ్రీనివాసరెడ్డి 1999నుంచి చాలా ఏళ్లు ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్, వైసీపీలోనూ ఆయన హవా కొనసాగింది. కాగా, YCP ప్రభుత్వ హయాంలో క్యాబినేట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోవడం, ఆయన సూచించిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్ఠానంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు, తాజా ఎన్నికల్లో ఓటమి, ఇతరత్రా కారణాలతో ఆయన వైసీపీని వీడినట్లు తెలుస్తోంది.

News September 18, 2024

చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి

image

చీరాల నియోజకవర్గంలో ఐటీ హబ్ ఏర్పాటుచేయాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మంత్రి నారా లోకేష్‌ను కోరారు. బుధవారం ఆయన మంత్రిని కలిసి హబ్ ఏర్పాటుకు సంబంధించిన వసతుల గురించి తెలియజేశారు. హబ్ ఏర్పాటైతే స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందన్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి హబ్ ఏర్పాటుకు కృషిచేస్తామని లోకేశ్ తెలిపారు.