News June 29, 2024
దర్శి: కేవీకే కోఆర్డినేటర్గా సీనియర్ శాస్త్రవేత్త

దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాధ్యతలను సీనియర్ శాస్త్రవేత్త డా.జీ.రమేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేవీకే బోధన బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని భరోసా కల్పించారు. ఈయన గతంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రంలో సమన్వయకర్తగా విధులను నిర్వహించారు.
Similar News
News October 19, 2025
రేపు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన (ప్రభుత్వ సెలవు దినం) పండుగ కారణంగా “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం” తాత్కాలికంగా రద్దు చేయడమైనదని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.
News October 19, 2025
ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News October 19, 2025
ప్రకాశంకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.