News April 29, 2024

దర్శి: గొడవను అడ్డుకోబోతే హత మార్చారు

image

దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు ఆస్తి తగాదాలతో రాజా వెంకటేష్(32) అనే యువకుడిని చిన్నమ్మ కూతురు భర్త బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. చిన్నమ్మ కూతురుపై దాడికి యత్నించడంతో వెంకటేష్ అడ్డు రావడంతో కత్తులతో పొడిచి పరారయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 9, 2025

ప్రకాశం: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

image

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446189, సీఐలు 9440446187, 8333925624, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కాగా నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం.

News December 9, 2025

పశ్చిమ ప్రకాశం వాసులకు తీరనున్న ప్రయాణ కష్టాలు

image

ఏపీ ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే యర్రగొండపాలెం (135 km), మార్కాపురం (98 km), కనిగిరి (92 km)కి దూరం ప్రయాణించాల్సి వచ్చేదని పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన మార్కాపురం జిల్లాలో కలిపిన నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం 65(km)లోపే ఉంటుంది. గిద్దలూరుకు మాత్రం ఒంగోలుతో పోల్చుకుంటే మార్కాపురం దగ్గరే.

News December 9, 2025

ప్రకాశం: గుండెల్ని పిండేసే దృశ్యం.!

image

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద సోమవారం 2 లారీలు ఢీకొని వ్యక్తి లారీలోనే <<18508533>>సజీవ దహనమయ్యాడు.<<>> లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో బయటకు రాలేక నిస్సహాయ స్థితిలో డ్రైవర్ అగ్నికి ఆహుతయ్యాడు. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపుచేసి వ్యక్తి శరీర భాగాలను అతి కష్టంమీద బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం బేస్తవారిపేట ఆసుపత్రికి తరలించారు. ఫొటోలోని దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.