News September 23, 2024
దర్శి పట్టణంలో బాలినేని ఫ్లెక్సీలు
‘జై జనసేన, వెల్కమ్ బాస్’ అంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు దర్శి పట్టణంలో ఫ్లెక్సీలు కట్టారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈనెల 26న జనసేనలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శిలో ఉన్న బాలినేని అభిమానులు దర్శిలో జనసేన ఫ్లెక్సీలు కట్టారు.
Similar News
News October 4, 2024
ప్రకాశం: అక్రమ రవాణాపై దృష్టి సారించండి: కలెక్టర్
జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా మైనింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అక్రమ రవాణాపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ స్లాబ్‌ల అనధికార రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలను చేశారు.
News October 3, 2024
చీరాలలో పిడుగుపాటుకు విద్యార్థిని మృతి
చీరాల మండలం పాతచీరాలలో తీవ్ర విషాదం నెలకొంది. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తులసి పిడుగుపాటుకు గురై గురువారం మృతి చెందింది. దసరా సెలవులు ఇవ్వడంతో తులసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం వర్షం పడుతున్న సమయంలో మేడ పైకి వెళ్లింది. అదే సమయంలో తులసి మీద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది.
News October 3, 2024
ఒంగోలులో సందడి చేయనున్న కీర్తి సురేశ్
ఒంగోలులో గురువారం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. నగరంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఉదయం10:30 గంటలకు హాజరుకానున్నారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మొదటి సారిగా ఒంగోలుకు వస్తున్న తరుణంలో యువత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.