News August 25, 2024
దర్శి బ్రాంచ్ కెనాల్లో మూడో విద్యార్థి మృతదేహం లభ్యం
దర్శి బ్రాంచ్ కెనాల్లో మూడో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని కొద్దిసేపటి కిందట గుర్తించారు. మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్థులు, పోలీసుల సహకారంతో కాలువలో గల్లంతయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కెనాల్లో ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు నిన్న గల్లంతు కాగా.. నిన్న ఒకరు, ఇవాళ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News September 12, 2024
ప్రకాశం: వరద బాధితులకు రూ.1 కోటీ 55 లక్షల విరాళం
ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని గోణసపూడి గ్రామవాసి, పారిశ్రామికవేత్త విక్రం నారాయణ కుటుంబం వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ మేరకు గురువారం CM చంద్రబాబు నాయుడిని కలిసి రూ.1,55,55,555 భారీ చెక్కును విక్రం నారాయణ అందజేశారు. ఆపద సమయాల్లో వరద బాధితులకు అండగా నిలిచిన విక్రం నారాయణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
News September 12, 2024
షర్మిలను కలిసిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు ఇన్ఛార్జ్ పాలపర్తి విజేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పై చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు షర్మిల సూచించారు.
News September 12, 2024
ప్రకాశం జిల్లా నేటి TOP NEWS
➤ దోర్నాల మండలంలో పర్యటించిన ప్రకాశం జిల్లా కలెక్టర్
➤ ఆసుపత్రిలో తల్లి మృతి.. బిడ్డను అమ్మేసిన తండ్రి
➤ కనిగిరి: రూ.66 వేలు పలికిన లడ్డూ
➤ కురిచేడు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
➤ కొత్తపట్నం: నమ్మించి సహజీవనం.. మరో పెళ్లిక యత్నం
➤ గిద్దలూరు: గణేష్ లడ్డూ పాడిన ముస్లిం సోదరులు