News February 12, 2025
దళ్లవలస వీఆర్ఓ సస్పెన్షన్

పొందూరు మండలం దళ్లవలస సచివాలయంలో వీఆర్ఓ జె.తవిటయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఆయన మీద ఆరోపణలు రావడంతో తహశీల్దార్ విచారించి కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. గ్రామ సభలను నిర్లక్ష్యం, మ్యూటేషన్కు డబ్బులు అడగడం తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడ్రోజులు క్రమశిక్షణ చర్యల కింద ఆర్టీవో కార్యాలయానికి సరెండర్ చేశారు. ఆరోపణలు రుజువు కావడంతో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 12, 2025
శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News November 12, 2025
హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.
News November 12, 2025
SKLM: నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉన్న న్యాయ సేవ అధికారి సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు.


