News October 10, 2024

దసరాకు వంతెనపై రాకపోకలు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల

image

దసరా పండుగ లోపు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లోలెవల్ కాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి, రాకపోకలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 28వ డివిజన్ ప్రకాశ్ నగర్‌లో పర్యటించి టీ.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.కోటి 90 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

Similar News

News November 6, 2024

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ 

image

ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మద్దతు ధరకే నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి కె.సురేంద్ర మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.

News November 5, 2024

కొత్తగూడెం: ఫుడ్ డెలివరీ బాయ్ సూసైడ్ 

image

కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరం తండాకు చెందిన అజ్మీర శివ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. వ్యవసాయ పనుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఉదయం పొలాలకు వెళ్లిపోయారు. కాగా సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువకుడు కొత్తగూడెం టౌన్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.

News November 5, 2024

ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

image

మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, మృతుడు మెరూన్ రంగు షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు చెప్పారు. ఖమ్మం జి.ఆర్.పి.సి భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.